
ఇంటర్నెట్ డెస్క్: పన్నెండేళ్ల కిందట రంజీల్లోకి అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్‌కు ఇప్పుడు టీమ్ఇండియా (Team India Test Cricket) టెస్టు జట్టులోకి ఎంట్రీ దక్కింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మరో ఆటగాడు అకిబ్ నబీతో కలిసి సారాంశ్ చిట్‌చాట్ చేశాడు. అకిబ్ అఫ్గాన్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు శ్రీలంకతో వీరిద్దరూ ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వీరి చిట్‌చాట్ వీడియోను బీసీసీఐ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘ఓసారి నేను గుడిలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి వస్తూ డ్రైవింగ్ చేస్తుండగా మళ్లీ కాల్ వచ్చింది. మెసేజ్‌లు కూడా వచ్చాయి. అప్పుడే నేను టీమ్ఇండియా(Team India)కు ఎంపికైనట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చాక నాకేమీ కొత్తగా లేదు. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఎలా ఉంటుందో అలానే ఉంది. వార్మప్ మ్యాచ్‌కు మూడు రోజుల ముందే జట్టుతో చేరా. ఇక్కడ ఉన్న 80 శాతం ప్లేయర్లతో దేశవాళీలో ఆడిన అనుభవం ఉంది. అందువల్ల వారితో సులువుగానే కలిసిపోయా’’ అని సారాంశ్ (Saransh Jain) వెల్లడించాడు. ‘‘టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాలంటే ఓర్పు అత్యంత ముఖ్యం. నా కెరీర్ మొదలైనప్పటి నుంచి నేను ఇలానే ఉన్నా. 2014-15 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టా. ఇక్కడికి చేరుకొనేందుకు చాలా కష్టపడ్డా. ఎన్నో త్యాగాలు చేశా. ఎప్పటికైనా భారత జట్టుకు ఆడతానని కలలు కన్నా. ఇప్పుడు అవకాశం వచ్చింది. దీని వెనుక నా కుటుంబం పాత్ర వెలకట్టలేనిది. మా నాన్న కూడా రంజీ ప్లేయరే. సహనంతో ఉండాలని ఆయనే చెప్పేవారు. అప్పుడే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయని అనేవారు. ఇప్పుడు ఆ మాటలు నిజమయ్యాయి’’ అని సారాంశ్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు