
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ ప్రక్రియలో, టోర్నమెంట్ ఫార్మాట్లో ఆకస్మికంగా మార్పులు చేయడంపై స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది అసోసియేట్ దేశాల (చిన్న జట్లు) క్రికెట్ అభివృద్ధికి పెద్ద దెబ్బ అని, ప్రపంచవ్యాప్తంగా ఆటను విస్తరించే ప్రయత్నాలకు ఇది గొడ్డలిపెట్టు అని హెచ్చరించాయి.ఏమిటీ కొత్త మార్పులు?గత జులైలో ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం తర్వాత ఈ మార్పులను ప్రకటించారు. వాస్తవానికి, ఈ టోర్నమెంట్లో 14 జట్లు పాల్గొనాలి. వాటిని ఏడేసి జట్లుగా రెండు గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత 'సూపర్ సిక్స్' దశ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఐసీసీ ఇప్పుడు 'సూపర్ సిరీస్', 'సూపర్ 7' అనే కొత్త దశలను ప్రవేశపెట్టింది.ఈ కొత్త విధానం ప్రకారం, క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి మూడు స్థానాల్లో (12, 13, 14) నిలిచిన జట్లు మొదట 'సూపర్ సిరీస్' ఆడతాయి. ఇందులో గెలిచిన ఒక్క జట్టు మాత్రమే తర్వాతి దశకు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత, టాప్ 11 జట్లతో కలిసి మొత్తం 12 జట్లను ఆరేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3 జట్లతో పాటు, ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మరో జట్టుతో కలిపి మొత్తం ఏడు జట్లు 'సూపర్ 7' దశలో ఆడతాయి. ఈ ఏడు జట్ల మధ్య జరిగే రౌండ్ రాబిన్