© 2026 nimisham.in

<p>రామ్ చరణ్ ( Ram Charan) నటించిన పెద్ది (Peddi) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకలకు ఎదుటకు రానుంది. ఈ నూపథ్యంలో మేకర్స్ సోమవారం విజయవాడలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా .. డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu) మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన మంత్రులకు, ఎంపీ కేసినేని చిన్ని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహంతో ఈ వేడుక అద్భుతంగా జరుగుతోంది. ఉప్పెన సినిమా చేసిన ఐదేళ్ల తర్వాత పెద్ది చేశాను. ఉప్పెనకు జాతీయ అవార్డు వచ్చింది, నిర్మాతలకు మంచి విజయాన్ని తీసుకొచ్చింది. ‘ఇంత సమయం ఎందుకు తీసుకున్నావు?’ అని చాలామంది అడిగారు. నేను పెద్ది కోసం తీసుకున్నాను. ఉప్పెన కథను కూడా విజయవాడలోనే రాసుకున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. </p><p>నన్ను రామ్ చరణ్ గారి దగ్గర కూర్చోబెట్టిన మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఉప్పెనను నాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే, పెద్దిని రామ్ చరణ్ గారు ఇచ్చారు. ఈ కథ చెప్పిన తర్వాత చరణ్ గారు ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. అంత నమ్మకం ఉంచారు. పెద్ది ఒక కమర్షియల్ సినిమా లాగానే కనిపించినా, లోపల బలమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక ఆటగాడి ప్రయాణం, అతని ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటం, తన విజయం తన చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా మారుస్తుందనే కథ ఇది. పెద్ది ఎగిసిపడే మనిషి కథ కాదు... పడిపోయి మళ్లీ లేచే మనిషి కథ. నేను ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు వందసార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారీ ఎమోషనల్ అవుతాను. కళ్లల్లో నీళ్లు వస్తాయి. సినిమా చూసిన వాళ్లందరూ కూడా అదే చెబుతున్నారు.</p><p> జూన్ 4న ఈ సినిమా విడుదల అవుతోంది. కుటుంబ సమేతంగా వెళ్లి చూడండి. మీ పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే ఒక యువకుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది. పెద్ది సాధించే విజయం ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. జాన్వీ కపూర్ గారు ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఆమె నటనలో కూడా ఒక ప్రత్యేకమైన హీరోయిజం ఉంటుంది. ఇంత పెద్ద సినిమాలో నన్ను నమ్మి, ఒక్కరోజు కూడా ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాత సతీష్ కిలారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. </p><p>జగపతి బాబు గారు