
Harish Rao | పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజ్ గోపాల్ పేట్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విద్యార్థులను చూసి ఆగి వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే. ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు నాకు బాగా తెలుసు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో నిరుపేద విద్యార్థులు ఈ చదువుల ద్వారానే దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న వారిలో 95 శాతం మంది నిరుపేద విద్యార్థులేనని.. నామమాత్రపు ఫీజులు కట్టి, నాణ్యమైన ఇంజనీరింగ్ స్థాయి విద్యను డిప్లొమాలోనే వాళ్లు నేర్చుకుంటున్నారు. పాలిటెక్నిక్‌ను ఐటీఐలో కలపడం వల్ల అది తన స్టేటస్ కోల్పోతుందన్నారు హరీశ్ రావు. ఇప్పుడున్న విధానం ప్రకారం పాలిటెక్నిక్ పూర్తవగానే ఇంజనీరింగ్ సెకండియర్‌లో నేరుగా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఐటీఐలతో కలిపితే మళ్లీ ఇంటర్మీడియట్ చదివితే తప్ప ఇంజనీరింగ్ సీటు రాని దుస్థితి వస్తుందని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంతటి పటిష్టమైన విద్యావ్యవస్థను తెలంగాణ విద్యాచట్టం పరిధి నుంచి తొలగించి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడం దారుణం. దీనివల్ల నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమై, వ్యవస్థ పూర్తిగా పతనమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి అయోమయంలో విద్యార్థులు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లవుతున్నా నేటికి విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేడు. ఆ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా చూస్తున్నా.. విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. విద్యార్థులు, మేధావులతో ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణ చేపట్టకుండా, కనీస విధివిధానాలు కూడా బహిర్గతం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం