© 2026 nimisham.in
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య.. ఫేక్ ఆర్డర్‌తో రప్పించి కాల్చిన దుండగులు! తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల కుంచా అన్షుల్... గత నాలుగేళ్లుగా నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటున్నాడు. ఉన్నత చదువులు పూర్తి చేసిన అతడు.. అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే, వీకెండ్స్‌లో పార్ట్ టైం జాబ్‌లో భాగంగా.. రేమండ్ రోసెన్ హోమ్స్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో... డోర్‌డాష్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12 గంటల 30 నిమిషాల సమయంలో... అన్షుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం... ఖాళీగా ఉన్న ఇంటి అడ్రస్‌కు డెలివరీ ఆర్డర్ పెట్టి... అన్షుల్‌ను అక్కడికి రప్పించారు. అతను ఆర్డర్ డెలివరీ చేసి తిరిగి వస్తుండగా... చాలా దగ్గర నుంచి అతని తలపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖాళీగా ఉన్న ఆ ఇంటి లోపల... మూడు అన్ఓపెన్డ్ పిజ్జా బాక్స్‌లు, ఒక డెలివరీ బ్యాగ్ లభించడాన్ని బట్టి... అతను డెలివరీ పూర్తి చేసిన వెంటనే... ఈ దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబసభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన