
ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జాబెర్‌ హుస్సేన్‌ (27) హఠాన్మరణం చెందారు. ఐదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం మసాచుసెట్స్‌ వెళ్లిన తమ కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్నాడని, తమతో మాట్లాడిన కొన్ని గంటలకే చనిపోయినట్లు సమాచారం అందిందని విలపించారు. మృతికి గల కారణాలు తెలియనప్పటికీ.. నిద్రలోనే జాబెర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలో హైదరాబాద్ టెకీ హఠాన్మరణం బాధిత కుటుంబాన్ని ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లా ఖాన్‌ పరామర్శించారు. వీరిది ఆర్థికంగా వెనకబడిన కుటుంబమని, దీనిని పరిగణనలోకి తీసుకొని మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చేందుకు రాయబార కార్యాలయం సాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు లేఖ రాసినట్లు అమ్జద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





