
తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్ సాధించిన హుషార్ పిట్టలు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేశాయి. ఆగస్టు 15న ఈ చిత్రం అనూహ్యమైన ఓపెనింగ్స్‌తో, అద్భుతమైన మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తొ బ్లాక్‌బస్టర్ విజయంగా నిలిచింది. తొలివారంలో ఈ చిత్రం 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ను సాధించి విజయవంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ''చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల మధ్యలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. రెండవారంలో కూడా అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే రోజు మా సినిమా థ్యాంక్స్ మీట్ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో చిరంజీవితో సినిమా తీస్తాను. నా దగ్గర కథ రెడీగా ఉంది. హుషార్ పిట్టలు సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి నా లాంటి కొత్త దర్శకుడిని ప్రోత్సాహించడం ఎంతో ఎనర్జీని ఇచ్చింది. భవిష్యత్‌లో మరిన్ని యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అన్నారు. హీరో అన్షు మాట్లాడుతూ '' నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్క్షతలు. ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ కావడానికి కారణమైన సురేష్‌బాబు, బెక్కెం వేణుగోపాల్ కు థ్యాంక్స్. పెద్ద సినిమాల మధ్యలో విడుదలైన మా సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. యూత్ మా సినిమాకు బ్రహ్మారథం పడుతున్నారు. పేరెంట్స్ కూడా మా సినిమా చూస్తున్నారు. నా తొలిసినిమానే ఇంత పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. మా సినిమాలో ఉన్న సందేశాన్ని అందరూ బాగా రీసీవ్ చేసుకుంటున్నారు. త్వరలోనే