వాళ్లిద్దరికీ 12 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ కొడుకు కూడా పుట్టాడు. కానీ.. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత భార్యభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అవికాస్తా పెద్దవి కావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భర్త తన కొడుకు కోసం వచ్చాడు. కొడుకును తనతో పంపించాలంటూ గొడవ చేశాడు. అత్తమామలు, బావమరిది ఒప్పుకోకపోవడంతో చేసేదేం లేక ఇంటికెళ్లాడు. ఒకరోజు భార్య బస్టాండ్లో కనిపించడంతో పుట్టింటి దగ్గర వదిలిపెడతానని చెప్పి బైక్ ఎక్కించుకుని దారి మధ్యలో బండరాయితో మోదీ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, దొనకొండ మండలం చందవరానికి చెందిన రమణమ్మకు పన్నెండేళ్ల కిందట వివాహమైంది. కొడుకు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య వివాదాలు వచ్చాయి. దాంతో రమణమ్మ కొడుకును తీసుకుని పుట్టిల్లయిన దొనకొండ మండలం చందవరానికి వెళ్లింది.READ ALSO Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టుఈ క్రమంలోనే ఆమె మానసిక సమస్యతో బాధపడుతూ గుంటూరు వైద్యశాలలో చికిత్స తీసుకుంటుంటుంది. కొంతకాలంగా ఆమె వైద్యం తీసుకుంటూ కొడుకుతోనే పుట్టింటిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు జూన్ 30న చందవరానికి వెళ్లి కుమారుడిని తన వద్దకు పంపించాలని అత్తమామలను అడిగాడు. వారి ఒప్పుకోకపోవడంతో భార్య, అత్తమామలు, బావమరిదితో గొడవకు దిగాడు. కుమారుడిని పంపించకపోతే ఎంతకైనా తెగిస్తానంటూ హెచ్చరించి వెళ్లిపోయాడు.ఆగస్టు 4వ తేదీన రమణమ్మ కనిగిరి బస్టాండ్ వద్ద ఉండటంతో.. వెంకటేశ్వర్లు ఆమె దగ్గరకు వెళ్లాడు. తనను పుట్టింటిలో వదిలిపెడతానని బైక్ ఎక్కించుకున్నాడు. బైక్పై కనిగిరి నుంచి చందవరం తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కల్లూరు వద్ద భార్యను బండరాయితో మోదీ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమె ఎలా చనిపోయింది అన్న కోణంలో దర్యాప్తు చేసి కురిచేడు మండలం