
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఓ మానవతా దృశ్యం వెలుగుచూసింది. ప్రచండ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ బైకర్‌ను ఓ నవవధువు తన చున్నీ సహాయంతో కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ఓ కుటుంబం చూపిన చొరవ, ఆ నవవధువు ప్రదర్శించిన సమయస్ఫూర్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగిందంటే..!హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఓ బైకర్ తన వాహనంతో రోడ్డు దాటేందుకు ప్రయత్నించి, ఆకస్మిక వరదలో చిక్కుకుపోయాడు. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో బైక్‌తో సహా కొట్టుకుపోయే ప్రమాదంలో పడ్డాడు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.అదే సమయంలో కారులో అటుగా ప్రయాణిస్తున్న ఓ కుటుంబం, వరదలో చిక్కుకున్న బైకర్‌ను గమనించి వెంటనే తమ వాహనాన్ని ఆపింది. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి అతడిని కాపాడేందుకు ముందుకు వెళ్లాడు. కానీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అతడికి సమీపంగా వెళ్లడం కష్టమైంది. పరిస్థితి క్లిష్టంగా మారుతున్న తరుణంలో, అదే కారులోని ఓ నవవధువు ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చింది. తన చున్నీని తీసి, వరదలో చిక్కుకున్న బైకర్ వైపు విసిరింది.ఆ చున్నీని పట్టుకున్న బైకర్, దాని సాయంతో నెమ్మదిగా కారు వైపు రాగలిగాడు. కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా అతడిని సురక్షితంగా బయటకు లాగారు. ఈ సాహసోపేతమైన రక్షణ చర్య మొత్తం వీడియోలో రికార్డ్