
క్యారెట్ వేర్లు లోతుగా వెళ్లాలంటే, కనీసం 12–15 అంగుళాల లోతున్న గ్రో బ్యాగ్‌ను ఎంచుకోవాలి. అదనపు నీరు బయటకు పోవడానికి బ్యాగ్ అడుగున తగినన్ని రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. గ్రో బ్యాగ్ నింపడానికి 40 శాతం కోకో పీట్, 30 శాతం పశువుల ఎరువు లేదా కంపోస్ట్, 30 శాతం మట్టి లేదా ఇసుక కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. క్యారెట్లు చక్కగా రావాలంటే మట్టిలోని రాళ్లు, గడ్డలను తీసేయాలి. విత్తనాలను కొద్దిగా ఇసుకతో కలిపి చల్లాలి. ఆ తర్వాత, పైన పావు అంగుళం మందంతో మట్టిని చల్లాలి. మొలకలు 2 అంగుళాల ఎత్తుకు పెరిగాక, బలహీనంగా ఉన్నవాటిని తొలగించాలి. మొక్కల మధ్య 2–3 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. రోజూ కనీసం 5–6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట గ్రో బ్యాగ్‌ను ఉంచాలి. మట్టిలో ఎప్పుడూ తేమ ఉండాలి కానీ నీరు నిలిచిపోకూడదు. విత్తనాలు నాటిన 70–90 రోజుల్లో క్యారెట్ పైభాగం మట్టి నుంచి పైకి కనిపిస్తుంది. అప్పుడు క్యారెట్లు కోతకు సిద్ధంగా ఉన్నాయని అర్థం. Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్ Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు! Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!