
రేపటితో ముగియనున్న గడువు వాంకిడి(మంచిర్యాల): గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు. ఇన్నేళ్లు గడిచినా.. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. వినియోగదారులు ఆగస్టు 16 లోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఇంటి వద్దనే ఫోన్లో యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటును ఏజెన్సీలు కల్పించాయి. కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలి ముద్రలు, ఐరిస్ వంటి మూడు విధానాలతో ఎల్పీ వినియోగదారులు ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. హెచ్‌పీ.. ప్లే స్టోర్ నుంచి హెచ్‌పీ పే తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ గ్యాస్ అకౌంట్‌కు లింకైన మొబైల్ నంబరు ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం హోమ్ పేజీలో మై హెచ్‌పీ సెక్షన్‌కు వెళ్లి ఎల్పీజీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచ నలు పాటించాలి. అనంతరం కాప్చర్ ఫేస్‌పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. తర్వాత ముఖాన్ని స్కాన్ చేస్తే పూర్తవుతుంది. భారత్.. ప్లేస్టోర్ నఉంచి హెలో బీపీసీఎల్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్టర్ మొబైన్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ-కేవైసీ ఆప్షన్ కలిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనం తరం ప్రొసెస్కు సూచనలు చేస్తుంది. దాన్ని పాటిస్తూ పూర్తి చేసుకోవాలి. ఇండెన్.. ప్లేస్టోర్ నుంచి అండియన్ ఆయిల్ వన్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లను