
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయ నిపుణులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. తాము పనిచేసిన దేశాల్లో చెల్లించిన సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ నిధులు తిరిగి పొందే అవకాశం లేక ఏటా బిలియన్ల డాలర్లను విదేశాల్లోనే వదిలేయాల్సి వస్తోంది.ఈ నష్టాన్ని సాంకేతికంగా ఎగ్జిట్ టాక్స్ అని పిలుస్తున్నప్పటికీ, ఇది మనం విదేశాలు వదిలేటప్పుడు వేసే పన్ను కాదు. ఆయా దేశాల్లో నిర్దేశించిన కనీస వ్యవధి వరకు పనిచేయకముందే భారత్కు తిరిగొచ్చేయడం వల్ల తాము దాచుకున్న సొమ్మును శాశ్వతంగా కోల్పోయే ఒక దారుణమైన పరిస్థితి!అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో బిలియన్ డాలర్ల నష్టం!అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికాలో భారతీయులు తమ ప్రతి పే-చెక్ నుంచి 7.65 శాతం సొమ్మును సోషల్ సెక్యూరిటీ కింద చెల్లిస్తారు. అయితే, అమెరికాలో వరుసగా 10 ఏళ్ల పాటు పనిచేయకపోతే ఆ డబ్బును క్లెయిమ్ చేయడం కుదరదు. పైగా భారత్-అమెరికా మధ్య టోటలైజేషన్ ఒప్పందం లేకపోవడం వల్ల ఏటా దాదాపు 3.0 నుంచి 3.5 బిలియన్ డాలర్ల భార్య సొమ్మును భారతీయ ఉద్యోగులు నష్టపోతున్నారు.జర్మనీలో 5 ఏళ్లు పూర్తికాకముందే స్వదేశానికి వస్తే మన సొంత కాంట్రిబ్యూషన్ మాత్రమే వెనక్కి ఇస్తారు కానీ, కంపెనీ చెల్లించిన 9.3 శాతం నిధులు పూర్తిగా పోతాయి. బ్రిటన్లో కూడా పన్ను మినహాయింపులకు సంబంధించి కఠిన నిబంధనలు మన నిపుణులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!రిటర్న్ అయ్యేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!విదేశాల నుంచి ఇండియాకు ప్యాక్ అయ్యే సమయానికంటే కొన్నేళ్ల ముందే సరైన ప్లానింగ్ చేసుకుంటే ఈ నష్టాన్ని అధిగమించవచ్చు.పన్ను రికార్డులు పక్కాగా ఉండాలి: అమెరికా వంటి దేశాల్లో గత ఐదేళ్ల టాక్స్ ఫైలింగ్ రికార్డులు పక్కాగా ఉండాలి. ఒక్క చిన్న ఎఫ్బీఏఆర్ (FBAR) రికార్డు మిస్ అయినా భారీ జరిమానాలు పడతాయి.ఆస్తులు, నిధుల వర్గీకరణ: జర్మనీ, ఇతర ఐరోపా దేశాల్లో భారీ ఫండ్స్ ఒకే