
ఒక భవనం పైకప్పు మీద ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఒకరు టామ్ క్రూజ్. మరొకరు బ్రాడ్ పిట్. కెమెరా వాళ్ల చుట్టూ తిరుగుతోంది. ఇద్దరి కదలికలు సహజంగా ఉన్నాయి. ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఫైట్‌లో వచ్చే చిన్న చిన్న బాడీ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీరందరూ దాదాపు చూసింది. చూస్తే అది ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా నుంచి కట్ చేసిన సీన్‌లాగే అనిపిస్తుంది. కానీ… ఆ ఫైట్ అసలు జరగలేదని తెలుసు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ కలిసి ఆ సీన్ చేయలేదు. ఏ సినిమా షూటింగ్‌లోనూ అది తీయలేదు. కేవలం ఒక AI టూల్ దాన్ని సృష్టించింది. ByteDanceకు చెందిన Seedance AI వీడియో మోడల్‌తో రూపొందిన ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, చాలామందికి అది కేవలం మరో AI వీడియోగానే కనిపించింది. అయితే హాలీవుడ్‌కు మాత్రం అందులో మరో విషయం కనిపించింది. సినిమా సృష్టించే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న గీత ఒక్కసారిగా చెరిగిపోతోందని. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి సీన్ కోసం నటులు కావాలి. కెమెరా కావాలి. లొకేషన్ కావాలి. స్టంట్ టీమ్ కావాలి. VFX నిపుణులు కావాలి. భారీ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఒక ప్రాంప్ట్‌తో ఇలాంటి విజువల్‌ను తయారు చేయగలిగితే… అసలు సినిమా పరిశ్రమలో ఎవరి హక్కులు ఎక్కడ మొదలవుతాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు Hollywoodను, AI కంపెనీలను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకొచ్చింది. హాలీవుడ్ స్టూడియోలకు తమ సినిమాలు, పాత్రలు, ఫ్రాంచైజీలు కేవలం కథలు కాదు. అవే బిలియన్ డాలర్ల విలువైన intellectual property. AI వాటిని అనుమతి లేకుండా ఉపయోగించి కొత్త వీడియోలు తయారు చేస్తే, ఆ సృష్టికి హక్కు ఎవరిది? ఇది కేవలం ఒక లీగల్ ప్రశ్న కాదు. రేపటి సినిమా బిజినెస్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్న సమస్య కూడా. Seedance తో