
ఉడికించిన కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్. అంతేకాదు, తక్కువ ధరకే అందరికీ ఈజీగా లభించేస్తుంది. అయితే, ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం కావడంతో.. తీరికగా వండుకోవడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు.దీంతో ఒకేసారి వండేస్తూ ఉంటారు. కానీ, ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం... అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం, బాగా ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్ లో వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. గుడ్డును ఉడకపెట్టినప్పుడు దానిపై ఉండే సహజ రక్షణ పొర తొలగిపోతుంది. అందుకే, ఉడికించిన గుడ్డు పైన షెల్ తొలగించినా, తొలగించకపోయినా కూడా.. పాడవ్వకుండా ఉండాలంటే, బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి. పెంకు ఉన్న గుడ్లు : గుడ్డు పెంకు ఇతర వాసనలు, మలినాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. వీటిని శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో (Airtight container) పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి. పెంకు తీసిన గుడ్లు : పెంకు తీసిన గుడ్లు ఎండిపోకుండా ఉండాలంటే, డబ్బాలో ఒక తడి పేపర్ టవల్ ఉంచి దానిలో వీటిని నిల్వ చేయాలి. లేదా శుభ్రమైన చల్లటి నీటిలో ముంచి ఉంచి, రోజూ నీటిని మారుస్తుంటే వారం రోజులు తాజాగా ఉంటాయి. వెంటనే ఫ్రిజ్లో పెట్టండి: గుడ్లను ఉడకబెట్టిన 2 గంటల లోపే ఫ్రిజ్లో పెట్టాలి. బయట ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. గాలి చొరబడని డబ్బాలు వాడండి: ఇవి తేమ ఆవిరి కాకుండా నిరోధించడమే కాకుండా, ఫ్రిజ్లోని ఇతర పదార్థాల వాసనలు గుడ్డుకు పట్టకుండా చూస్తాయి. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉంచండి: డోర్ వైపు కాకుండా రిఫ్రిజిరేటర్లో బాగా చల్లగా ఉండే మధ్య అర వెనుక భాగంలో ఉంచాలి. డేట్ లేబుల్ వేయండి: గుడ్లను ఉడకబెట్టిన తేదీని డబ్బాపై రాసుకోవాలి