మీ మనసులో గందరగళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి.
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. శుక్ర, చంద్రుడి ప్రభావంతో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సహోద్యోగుల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు సూర్య నమస్కారాలు చేయాలి.
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ మనసులో ఉద్రిక్త వాతావరణం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు పోటీదారుల నుంచి గట్టిపోటీ ఎదురవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు పాత ప్రాజెక్టుల నుంచి నష్టాలు ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా సహనంతో ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొందరు వ్యక్తులతో కొన్ని విషయాల పట్ల విభేదాలు తలెత్తొచ్చు. పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
తులా రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండిగులో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏ పనినీ వాయిదా వేయకుండా, దానిని వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పరిహారం : ఈరోజు సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. మరోవైపు ఏదైనా ఆస్తిని అమ్మాలని లేదా కొనాలని ప్లాన్ చేస్తుంటే, అది ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులలో చాలా ఓపికగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
ధనస్సు రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. అయితే మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పనిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభించొచ్చు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. పరిహారం :ఈరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి.
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పనికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభించకపోవచ్చు. పరిహారం :ఈరోజు సూర్య మంత్రాలను జపించాలి.
కుంభ రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీకు బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అయితే ఉద్యోగులకు కార్యాలయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. మరోవైపు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. పరిహారం :ఈరోజు సూర్య దేవాలయంలో దానధర్మాలు చేయాలి.
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసిన పనిలో మంచి ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అనేక రంగాల్లో మీకు మద్దతు లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి