
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. దీన్ని ప్రభావితమయ్యే రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే సెప్టెంబరు నెలకు సంబంధించి మిథున రాశి, కర్కాటక రాశికి సంబంధించినవారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం.మేష రాశి, వృషభరాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలుమిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు)మిథున రాశి వారికి సెప్టెంబరు నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 10వ ఇంట్లో శని సంచారం వల్ల పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. అయితే, మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రమోషన్ లేదా ఉన్నతాధికారుల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ధనకారకుడైన గురుడు ద్వితీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల ఆదాయ మార్గాలు బాగుంటాయి. అయితే, మధ్యంతరంగా నవంబరు వరకు సాగే కొన్ని గ్రహ మార్పుల వల్ల ఆకస్మిక ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. జీవన భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. నిరంతర పని ఒత్తిడి వల్ల మానసిక అలసట లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా బుధవారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం శుభ ఫలితాలనిస్తుంది.తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలంకర్కాటక రాశి (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)కర్కాటక రాశి