© 2026 nimisham.in

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ముక్కలైంది. ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా ఆ రెండు వాణిజ్య నౌకలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇంత స్వల్ప వ్యవధిలో అంటే రోజుల వ్యవధిలోనే పటాపంచలైంది. ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఇరాన్ దూకుడుకు కారణమేంటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి అమెరికా తదుపరి ఎలాంటి కఠిన అడుగులు వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు. !
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ముక్కలైంది. ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
ఈ దాడుల కారణంగా ఆ రెండు వాణిజ్య నౌకలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇంత స్వల్ప వ్యవధిలో అంటే రోజుల వ్యవధిలోనే పటాపంచలైంది. ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఇరాన్ దూకుడుకు కారణమేంటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి అమెరికా తదుపరి ఎలాంటి కఠిన అడుగులు వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Strait of Hormuz, Iran missile attack, IRGC attacks ships, US Iran agreement violated, Gulf maritime tension
ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు. !
.