© 2026 nimisham.in

HONOR Pad 20 Pro Paperlike Edition : హానర్ కొత్త టాబ్లెట్ వచ్చేసింది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో యాంటీ-గ్లేర్, టెక్స్చర్డ్ స్క్రీన్ సర్ఫేస్, హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ విద్యార్థులు, నిపుణులు, డిజిటల్ క్రియేటివ్లకు బెస్ట్ డివైజ్.. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. ధర ఎంతంటే? : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్ ధర త్వరలో వెల్లడి కానుంది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్ కేవలం గ్రే కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అడ్రినో 825 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10.0తో వస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 10100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్‌లైక్ ఎడిషన్‌లో బ్యాక్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్‌తో 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సౌండ్ ఫీచర్లలో 6 స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, DTS:X అల్ట్రా సౌండ్, హానర్ స్పేషియల్ ఆడియో ఉన్నాయి. కొలతల పరంగా పరిశీలిస్తే.. : ఈ టాబ్లెట్ 277.07 మిమీ పొడవు, 179.28 మిమీ వెడల్పు, 6.29 మిమీ మందం, 537 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైప్-C, OTG వంటి ఆప్షన్లు ఉన్నాయి
.