
టెస్ట్ క్రికెట్ ప్రారంభమై 149 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటివరకు ఎవరూ ఊహించని సంచలనం ఒకటి డార్విన్ మైదానంలో జరిగింది. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నజ్ముల్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డార్విన్ లోని మారా ప్రాంగణంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఓడించడం టెస్ట్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో గ్రీన్ సెంచరీ చేసినప్పటికీ ఆస్ట్రేలియాను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయి, ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ప్రధాన టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి బంగ్లాదేశ్ పూర్తిగా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి 198 పరుగులకే కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఏకంగా 426 పరుగులు సాధించింది. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. సాధారణంగా కంగారూలు ఫీల్డింగ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లో తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియాలో ఆసియా జట్ల అత్యధిక టెస్ట్ విజయాలు (ఈ శతాబ్దంలో): మ్యాచ్ నాలుగో రోజు ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ అప్ను దారుణంగా దెబ్బతీశాడు. ఆయన 33.1 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు