
వాహనదారులపై తాజాగా సెస్ రూపంలో అదనపు భారం పడింది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ అమ్మకాలపై నూతనంగా ఓ సెస్ అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరలు లీటరుకు 60 పైసల చొప్పున పెరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ నూతన రేట్లు అమలులోకి వచ్చాయి కూడా. ఈ సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని పూర్తిగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ సెస్ ను ప్రవేశపెట్టింది.. హిమాచల్ ప్రదేశ్. పెట్రోల్, డీజిల్ పై అనాథలు, వితంతువుల సంక్షేమ సెస్ ను ప్రవేశపెట్టింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరలు లీటరుకు 60 పైసల చొప్పున పెరిగాయి. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ వ్యాట్ సవరణ చట్టం ద్వారా అనాథ, వితంతు సెస్ రూపంలో గరిష్టంగా లీటరుకు అయిదు రూపాయల వరకు వసూలు చేసేందుకు వీలుంది. ప్రభుత్వం ప్రస్తుతానికి లీటరుపై 60 పైసలు మాత్రమే అదనంగా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ తాజా పెంపు వల్ల హిమాచల్ ప్రదేశ లో వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సిమ్లాలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుత రూ. 102.45 నుండి రూ. 103.05 కు చేరుకుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుపేద మహిళలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక భరోసా కల్పించడమే ఈ సెస్ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ సెస్ రూపంలో వచ్చిన నిధులన్నింటినీ కూడా వితంతువులు, అనాథల పునరావాసానికి, విద్య, వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేస్తామని వివరించింది.నేడు శక్తిమంతమైన అమావాస్య: జాతక దోషాలు తొలగిపోవాలంటే.. !!ఈ సెస్ ద్వారా వచ్చిన నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఫండ్ అకౌంట్ ను ఓపెన్ చేసింది. అనాథ- వితంతు సంక్షేమ నిధి పేరిట ఏర్పాటైన ఈ ఖాతాలో వీటిని జమ చేస్తారు. ఈ మొత్తం ద్వారా నిరుపేద కుటుంబాలకు