
భారత్‌లో తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైకుల మార్కెట్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌కు మంచి పేరుంది. రోజూ ఆఫీసుకు, ఇతర పనులకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి కస్టమర్స్ కోసమే హీరో ఈ బైక్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ బైక్ ధర మరింత తగ్గింది… కొన్ని చోట్ల కేవలం రూ.59,999 ప్రత్యేక ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. దీని ప్రారంభ ధర రూ.66,782గా ఉండేది… వివిధ ఆఫర్ల కింద ధర తగ్గించి అమ్ముతున్నారు. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ధరల తగ్గింపు బడ్జెట్ బైక్ కొనాలనుకునేవారి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ రూ.59,999 ధర దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఉండకపోవచ్చు. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్ లేదా స్టాక్ ఉన్నంతవరకే కావచ్చు. కాబట్టి కొనేముందు మీ దగ్గర్లోని హీరో డీలర్‌ను సంప్రదించి అసలు ధర, ఆఫర్ వివరాలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఖర్చుల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్స్-షోరూమ్ ధర వేరు, ఆన్-రోడ్ ధర వేరుగా ఉంటుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 PS గరిష్ట శక్తిని, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. సిటీ ట్రాఫిక్, రోజువారీ ప్రయాణాలకు ఈ బైక్ చక్కగా సరిపోతుంది. కొన్ని వేరియంట్లలో హీరో i3S టెక్నాలజీ కూడా ఉంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, పెట్రోల్ ఆదా చేస్తుంది. సస్పెన్షన్ విషయానికొస్తే ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. మెరుగైన భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఇలా అన్నిరకాలుగా ఇది బెస్ట్ ఫీచర్లను కలిగివుంది. మొత్తం మీద తక్కువ బడ్జెట్లో రోజువారీ ప్రయాణానికి ఒక మంచి బైక్