
Tirumala Rush Today: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు 12 నుంచి 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 82 వేల 8 వందల మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27 వేల 5 వందల 22 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 4 లక్షల 34 వేల లడ్డూలు , 2 లక్షల 54 వేల అన్నప్రసాదాలు విక్రయాలు జరిగాయి. భక్తులు భారీగా రావడంతో హుండీ ఆదాయం 4 కోట్ల 68 లక్షలు సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది.





