
దాదాపు అందరూ వంటల్లో రుచి, వాసన కోసం ఇంగువ వాడుతూ ఉంటారు. కానీ, ఈ ఇంగువ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రోజూ ఆహారంలో ఇంగువను చేర్చుకుంటే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. కడుపులో నులిపురుగుల సమస్యను తగ్గించడంతో పాటు, భరించలేని నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది.
ఇంగువ బీపీ రోగులకు చాలా మేలు చేస్తుంది. రోజూ ఇంగువ తినడం వల్ల సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్య రాదు. అంతేకాదు, ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
దగ్గు, కోరింత దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంగువను పాలలో కలిపి తాగవచ్చు.
నెలసరి సమయంలో వచ్చే భరించలేని నొప్పి నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఇంగువకు ఉంది. ఇది రక్త ప్రసరణను మరింత సులభతరం చేస్తుంది.
తీవ్రమైన తలనొప్పి ఉంటే, ఒక గ్లాసు నీటిలో 2 చిటికెల ఇంగువ వేసి మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజుకు రెండుసార్లు తాగాలి.
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్




