
భారత సైన్యంలో మాజీ అధికారి, స్పెషల్ ఫోర్సెస్ వెటరన్ కల్నల్ అనురాగ్ ఉపాధ్యాయ్ ఉదంతం నెట్టింట మరోమారు వైరల్గా మారింది. ఆయన కోలుకోవడానికి, మరింత స్వతంత్రంగా జీవించేందుకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు వైద్యులు, రిహాబిలిటేషన్ నిపుణులు, టెక్నాలజీ నిపుణుల సహాయం అవసరమని కుటుంబం బహిరంగంగా వెల్లడించింది. ప్రముఖ వ్యాపారవేత్త శ్రద్ధా శర్మ షేర్ చేసిన ఈ విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనురాగ్ ఉపాధ్యాయ్ కథ ప్రస్తుత వైద్య పరిస్థితికి ముందే ఎంతో భిన్నంగా ఉండేది. CAT పరీక్షలో ఆయన ఏకంగా 99వ పర్సంటైల్ సాధించారు. దీంతో కార్పొరేట్ రంగంలో మంచి కెరీర్ను ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన సైన్యంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం స్పెషల్ ఫోర్సెస్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.





