© 2026 nimisham.in
Gold Mutual Funds : చాలా మందికి బంగారంపై పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి ఉంటుంది. అయితే ఏమేం అవకాశాలు ఉంటాయో సరిగా తెలియకపోవచ్చు. అందుకే ఎక్కువగా భౌతికంగా బంగారం కొనుగోలు చేసి ఇంట్లోనో, బ్యాంకు లాకర్లలోనో దాచుకుంటుంటారు. అయితే ఇక్కడ బంగారంపై పెట్టుబడికి చాలానే ఆప్షన్లు ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్ ఇందులో చాలా ముఖ్యమైనవి. మ్యూచువల్ ఫండ్ల ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ గోల్డ్ ఆధారిత పెట్టుబడి పథకాల్లో ఆంక్షలు విధించిన మ్యూచువల్ ఫండ్స్ క్రమంగా ఆంక్షల్ని ఎత్తేస్తున్నాయి. ఇప్పుడు హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తమ గోల్డ్ బేస్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సబ్స్క్రిప్షన్ తిరిగి ప్రారంభించినట్లు తెలిపాయి.మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ఫండ్ హౌస్‌లు తెలిపాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మళ్లీ అవకాశం లభించింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తన హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో లంప్ సమ్ పెట్టుబడులపై గతంలో విధించినటువంటి తాత్కాలిక పరిమితుల్ని తొలగించింది. 2026, ఆగస్ట్ 14 నుంచి ఈ పథకంలో లంప్ సమ్ కొనుగోళ్లు, స్విచ్ - ఇన్లను ఎలాంటి పరిమితులు లేకుండా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న ఆంక్షలేమీ లేకుండా ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చని స్పష్టం చేసింది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కూడా తన గోల్డ్ ఆధారిత పథకాలపై గతంలో విధించిన పరిమితుల్ని తొలగించింది. యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్‌లో రూ. 25 కోట్లకు మించిన మొత్తాన్ని నేరుగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వద్ద పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సబ్స్క్రిప్షన్లు 2026, ఆగస్ట్ 18 నుంచి స్వీకరిస్తారు. ఇదే సమయంలో యాక్సిస్ గోల్డ్ ఫండ్‌లో లంప్ సమ్ సబ్స్క్రిప్షన్లు, స్విచ్- ఇన్లను కూడా ఆంక్షలు లేకుండా స్వీకరించనున్నారు.Read Also: నెల నెలా 'బంగారం'
కొనాలనుకుంటున్నారా? కొత్తవారికి ఇవే ఉత్తమ మార్గాలు.. ఎవరికి ఏది బెస్ట్?ఇప్పటికే గోల్డ్ ఆధారిత పెట్టుబడులపై పరిమితుల్ని తొలగించిన వాటిల్లో టాటా మ్యూచువల్ ఫండ్ (ఆగస్ట్ 21 నుంచి), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ (ఆగస్ట్ 13 నుంచి) వంటివి కూడా ఉన్నాయి. 2026 జూన్ నెలలో పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఫండ్లలో కొత్త పెట్టుబడులపై తాత్కాలిక పరిమితులు విధించాయి. గోల్డ్ ఆధారిత పథకాల్లోకి భారీగా పెట్టుబడులు తరలిరావడమే దీనికి కారణం. పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడంతో ఏర్పడే ఒత్తిడిని నియంత్రించేందుకు ఫండ్ హౌస్‌లు వీటిల్లో లంప్ సమ్ పెట్టుబడులు, పెద్ద ఇన్వెస్టర్ల పెట్టుబడులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి.