
Hasan Mahmud 6 Wickets: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యంగ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (71)ను వికెట్ వెనక్కి పంపి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా నేలపై ఈ ఘనత సాధించిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తన పేరిట 6 వికెట్లను నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై హసన్ మహమూద్ చారిత్రక రికార్డు.. టెస్టు క్రికెట్లో బలమైన ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే వణికించడం సాధారణ విషయం కాదు. కానీ బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ తన నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కాంగ్రూ బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. రెడ్ బాల్ క్రికెట్లో కెరీర్ బెస్ట్ స్పెల్ విసిరిన అతను, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో భారత్, పాకిస్తాన్ జట్లపై కూడా ఐదు వికెట్ల ఘనత సాధించిన ఈ కుర్రాడు, ఇప్పుడు ఆసీస్ పై కూడా అదే మ్యాజిక్ పునరావృతం చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. Chopped on and Travis Head departs on 22 runs#AUSvBAN #HasanMahmud #TravisHead #1stTest — Cricket Guru (@CricketGuru_CG) August 13, 2026 ఒకవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తూ ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే హసన్ మహమూద్ వేసిన 136.7 కిలోమీటర్ల వేగవంతమైన షార్ట్ బంతిని అంచనా వేయడంలో స్మిత్ పొరపాటు పడ్డాడు. షాట్ ఆడేందుకు ముందుకొచ్చి అనవసర తొందరపాటుతో బంతిని గాల్లోకి లేపాడు. వికెట్ కీపర్ లిటన్ దాస్ ఎటువంటి తప్పు చేయకుండా సులువుగా క్యాచ్ పట్టుకోవడంతో స్మిత్ పోరాటానికి తెరపడింది. టెస్టుల్లో ఎంతో నిలకడగా ఆడే స్మిత్