
ఇంటర్నెట్ డెస్క్: హరియాణా సింగర్ అంకిత్ బాల్యన్ హత్య వెనక సంచలన విషయం బయటకు వచ్చింది. అతడి హత్యకు ఓ పాట కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆగస్టు 26న సాయంత్రం అంకిత్ బాల్యన్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అతడిని (Ankit Balyan) దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతడు పాడి నటించిన ఓ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించడం.. దానికి ఏకంగా 54 మిలియన్ల (దాదాపు 5.4 కోట్ల) వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. పాట ఆదరణ పొందడంతో అతడిపై కక్ష పెంచుకున్న ‘గోగి గ్యాంగ్’ అంకిత్ ప్రాణాలు తీసింది. 28 ఏళ్ల అంకిత్ ‘భరీ కోర్ట్ మే గోలీ మారేంగే..’ అనే పాటలో నటించాడు. అయితే, ఈ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని గోగి గ్యాంగ్ సభ్యులు భావించినట్లు పోలీసులు తెలిపారు. 2021లో ఢిల్లీ రోహిణి కోర్టులో ప్రత్యర్థి ‘టిల్లు తాజ్‌పురియా’ గ్యాంగ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగి చావును ఈ పాట అవహేళన చేసేలా ఉందంటూ భావించింది. అంతేకాకుండా, టిల్లు తాజ్‌పురియా, అంకిత్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ప్రత్యర్థి గ్యాంగ్‌కు మద్దతుగా ఈ పాట తీశాడని గోగి గ్యాంగ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలోనే అంకిత్‌కు బెదిరింపులు రాగా, తాను కేవలం ఆ పాటలో నటించానని, లిరిక్స్, సంగీతంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయినా సరే, అతనిపై అనుమానం వీడని గోగి గ్యాంగ్ షామ్లీకి వచ్చి రెక్కీ నిర్వహించి ఆగస్టు 26న ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం రంగంలోకి దిగిన యూపీ పోలీసులు ఆగస్టు 31న నిర్వహించిన తనిఖీల్లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న