భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచకప్లో వారి భాగస్వామ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయసు ప్రభావం దృష్ట్యా వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా.. లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. ఆటగాళ్ల వయసును బట్టి కాకుండా వారి ఫిట్నెస్, మైదానంలో ఇచ్చే ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరగాలని స్పష్టం చేశాడు.ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఉదాహరణగా పేర్కొన్నాడు. మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో జట్టును నడిపించగా లేనిది, 38 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) విరాట్, 40 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) రోహిత్ శర్మలు 2027 ప్రపంచకప్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ మైదానంలో 20 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్నెస్లో ముందంజలో ఉన్నాడని, అలాంటప్పుడు వయసుతో పనేముందని వ్యాఖ్యానించాడు.టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హర్భజన్ సూచించాడు. కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నా.. 300కి పైగా మ్యాచ్లు ఆడిన రోహిత్, కోహ్లీల అనుభవం ఒత్తిడి సమయంలో జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ లాంటి ఆటగాళ్లకు సమానంగా రోహిత్, విరాట్లు ఫిట్నెస్ కాపాడుకుని పరుగులు సాధిస్తే మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అలాగే భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ మార్పునకు, ఓటమిని అంగీకరించని పట్టుదలకు విరాట్ కోహ్లీనే మూలకారకుడని హర్భజన్ ప్రశంసించాడు. శరీరం సహకరించడం లేదని, ఇతర ఆటగాళ్లతో పోటీ పడలేమని అనిపించినప్పుడు ఏ ఆటగాడైనా స్వయంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అప్పటివరకు రోహిత్, విరాట్లకు మేనేజ్మెంట్ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. భారత