
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Trump H1B Visa Rules: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టింది మొదలు వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ తీసుకువస్తున్న ఒక కొత్త ప్రతిపాదన అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ లేదా ఇతర లీగల్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏదైనా కారణం చేత కంపెనీ నుంచి తొలగించినట్లయితే.. వారికి మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు 60 రోజుల సమయం గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఇది 2017లో అమల్లోకి వచ్చిన ఈ నిబంధన టెక్కీలకు ఒక పెద్ద ఊరటగా ఉంది. ఒకవేళ ఉద్యోగం పోతే, ఆ 2 నెలల వ్యవధిలో మరో కొత్త కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో హెచ్-1బీని బదిలీ చేసుకోవడం లేదా వేరే వీసా కేటగిరీకి మారడం లేదంటే స్వదేశానికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకోవడానికి ఈ గడువు ఉపయోగపడేది అయితే తాజాగా ట్రంప్ యంత్రాంగం తెస్తున్న ప్రతిపాదన ప్రకారం.. హెచ్-1బీ అనేది కేవలం తాత్కాలిక ఉపాధి కార్యక్రమం మాత్రమేనని, ఉద్యోగం ఎప్పుడైతే కోల్పోతారో వెంటనే ఆ వ్యక్తి దేశం విడిచి వెళ్లాలని భావిస్తోంది. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేయాలని వైట్‌హౌస్ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే.. ఉద్యోగం