
ఇటీవల ఇరుముడి, విశ్వనాధ్ అండ్ సన్స్ వంటి హిట్స్ లైంలైట్లో ఉన్నాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar). ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఇమ్మోర్టల్’ (సెప్టెంబర్ 4 విడుదల) ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఓపెన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన మాజీ భార్య సైంధవి (Saindhavi)తో ఉన్న రిలేషన్షిప్ గురించి ఆయన మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భార్యాభర్తలుగా బంధం తెగిపోయినా తమ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉందని జీవీ ప్రకాష్ స్పష్టం చేశారు. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ కావడంతో ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ చెరిగిపోదని, విడాకులు తీసుకున్నంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. వివాహబంధం ముగిసినా ఒక మంచి రిలేషన్‌ను మెంటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటున్నామని తెలిపాడు జీవీ. కూతురు అన్వి పెంపకం విషయంలోనూ ఇద్దరం కలసి బాధ్యతలు షేర్ చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. అన్వి తన ప్రాణమని, జీవితంలో సైంధవి, కూతురు ఇద్దరూ అత్యంత కీలకమైన వ్యక్తులేనని చెబుతున్నాడు. విడిపోయినప్పటికీ పాప భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా కలసి ముందడుగు వేస్తున్న జీవీ ప్రకాష్ తీరును కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు