
మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘ఇరుముడి’. గ్లింప్స్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలు పెంచిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో విశేషాలు పంచుకున్నారు. నేను ఇప్పటివరకు ప్రేమ కథలు, కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ ‘ఇరుముడి’ మాత్రం మైండ్ బ్లోయింగ్ మలుపులతో సాగే ఒక ఇంటెన్స్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉండే ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ ఇచ్చేందుకు మంచి స్కోప్ లభించింది. ఈ సినిమాకి ఉత్తమ రీజినల్ ఫిల్మ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లాంటి జాతీయ అవార్డులు రావడం ఖాయం. అలాగే ఈ చిత్రం కమర్షియల్గానూ విపరీతమైన సక్సెస్ సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంపై రవితేజ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకా విడుదల చేయని క్లైమాక్స్ పాట ఆయనకు బాగా నచ్చింది. ఎంతో ఎమోషనల్‌గా ఉండే ఆ పాట కథకు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ ప్రత్యేకమైన పాటను నేరుగా థియేటర్లలోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. భక్తి నేపథ్యంతో ప్యూర్ డివోషనల్గా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాట ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. ఐకానిక్ భక్తి గీతమైన ‘మల్లెపూల పల్లకి’ ఒరిజినల్ ఫీల్ పోకుండా ఉండేందుకు, దానిని ఒరిజినల్ సింగర్ మరియు బృందంతోనే పాడించాం. గత నాలుగు రోజులుగా ఈ పాట ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉండటం సంతోషంగా ఉంది. భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ వంటి భిన్నమైన ఎమోషన్స్ ఉన్న ‘ఇరుముడి’ చిత్రానికి సంగీతం అందించడం ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. కేవలం రెండు, మూడు లేయర్స్‌లోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తూ, కథలోని ప్రతీ భావోద్వేగాన్ని మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేసేలా ఇంపాక్ట్ఫుల్ సైకలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాను. నాకు ‘యాలాలో’