© 2026 nimisham.in

Guru Aditya Rajayogam July 2026: జూలై 16వ తేదిన ఆదిత్య రాజయోగంతో ఈ కింది రాశులవారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. Guru Aditya Rajayogam July 2026 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..జూలై 16వ తేది చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈ రోజే గ్రహాధిపతి అయిన సూర్యుడు మిథున రాశిని వదిలి పెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, ఇది గురువారం రోజునే జరగడవ విశేషం. ఈ గ్రహ సంచారం జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనేక ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవతల గురువైన గురుడు ఇప్పటికే కర్కాటక రాశిలో సంచార దశలో ఉన్నాడు. దీని ఫలితంగా.. కర్కాటక రాశిలో సూర్య, గురు గ్రహాల ఈ కలయిక కూడా జరుగుతుంది. దీంతో అత్యంత శక్తివంతమైన అరుదైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రెండు గొప్ప గ్రహాల కయిక కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో సానుకూల మార్పుల కాలం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా విపరీతంగా లభిస్తుంది. దీని కారణంగా సంపద, వృత్తితో పాటు వ్యాపారంలో అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. మోస్ట్ పవర్ఫుల్ ఆదిత్య రాజయోగంతో కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు తప్పకుండా పదోన్నతులు కూడా పొందుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాల పరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అరుదైన గురు
ఆదిత్య రాజయోగం వల్ల మేష రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా భూములతో పాటు కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. జీవితంలో శాంతితో పాటు సంతోషం కూడా విపరీతంగా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు కూడా కలుగుతాయి.
ఈ గ్రహ సంయోగంతో మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో లాభదాయంగా ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు.
గురు ఆదిత్య రాజయోగం వల్ల కన్యా రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గణనీయంగా పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అలాగే చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగిపొందుతారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది.