క్యాన్సర్ రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించేలా గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ సెంటర్ మానవతా దృక్పథంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న రోగులకు ఇంటివద్ద ఉపశమన వైద్య చికిత్సలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేడియోథెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు చేసినా ఫలితం లేని క్యాన్సర్ రోగులకు ఇంటి వద్ద ఉపశమన చికిత్స సేవలను నాట్కో క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి తెచ్చింది. సుమారు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా.. ప్రతి నెలా 500 మంది వరకూ నమోదు చేసుకుంటున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి వైద్యులు ఇంటి వద్దకు వెళ్లి ఉచితంగా సేవలు అందిస్తున్నారు.క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజీలో ఉన్న రోగులు చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా అస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండా.. ఇంటి వద్దే వైద్య సేవలు అందించడమే నాట్కో క్యాన్సర్ సెంటర్ చేపడుతున్న ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతో క్యాన్సర్ రోగులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా, అలాగే ఆస్పత్రికి వచ్చే ప్రయాసలు కూడా తప్పుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. గుంటూరు సర్వజనాసుపత్రికి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక ఈ సేవలు పొందడం కోసం క్యాన్సర్ రోగులు, వారి కుటుంబ సభ్యులు 90300 44253 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ కాల్ సెంటర్ సేవలు ఉదయం ఎనిమిది గంటల సమయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. అయితే ఆదివారం రోజు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఫోన్ చేసి నమోదు చేసుకున్న వారి ఆరోగ్యపరిస్థితి, సమయాన్ని బట్టి వైద్య నిపుణులు ఇంటి వద్దకు వెళ్లి సేవలు అందిస్తారు.నాట్కో క్యాన్సర్ సెంటర్లోని పెల్లేటివ్ అంకాలజీ డాక్టర్లు, సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం