
Guthi: తొండపాడులో ఎంపీడీఓ ప్రభాకర్ తనిఖీలు BLOలకు కీలక ఆదేశాలు! Guthi: అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు , జక్కలచెరువు గ్రామంలో ఈరోజు SIR ప్రక్రియలో భాగంగా MPDO ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని BLO లతో సమావేశమై నోటీసుల పంపిణి గురించి ఆరా తీశారు. నోటీసులను త్వరితగతిన సర్వ్ చేయవలసినదిగా BLO లకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందించే సేవల్లో జాప్యం ఉండకూడదని, అన్ని సేవలు సమయానికి అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, BLO లు తదితరులు పాల్గొన్నారు
.