దేశవ్యాప్తంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి, ఏకంగా రూ. 1,071.5 కోట్లు దోచేసిన మాస్టర్ మైండ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్న 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్ అనే యువకుడ్ని అసోంలోని బార్పేటలో గుజరాత్ సీఐడీ సైబర్ సెల్ అదుపులోకి తీసుకుంది. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలతో బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును వేలాది బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించి, దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి చైనాకు పంపడంలో ఆలమ్ కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.మనీల్యాండరింగ్‌ను తలపించేలా..గాంధీనగర్‌కు చెందిన సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CCE) ప్రకారం.. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి నిఘా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ మోసాల ద్వారా దోచేసిన సొమ్మును దేశవ్యాప్తంగా ఉన్న 1,754 బ్యాంక్ ఖాతాలకు మళ్లించేవాడు. పెద్ద మొత్తంలో నగదును చిన్న చిన్న మొత్తాలుగా విభజించి, కేవలం ఒక గంట వ్యవధిలోనే వేర్వేరు ఖాతాల్లోకి జమ చేసేవాడు.చైనా నేరగాళ్లతో లింకులువాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా చైనా సైబర్ నేరాగాళ్లతో ఆలమ్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక పరమైన సమాచారం (స్కానర్లు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, క్రిప్టో వాలెట్ వివరాలు), నేరాల శైలిని నేరుగా వారితో పంచుకునేవాడు. నిందితుడి మొబైల్ ఫోన్లలో 23 క్రిప్టోకరెన్సీ వాలెట్లను గుర్తించిన పోలీసులు... వీటి ద్వారా దాదాపు రూ. 16 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఇవి క్రిప్టోకరెన్సీకి, చైనా గ్యాంగ్‌కు ఉన్న సంబంధాలను స్పష్టంగా నిరూపిస్తున్నాయి. అలాగే ‘చిప్ సెల్లర్’అనే యాప్ ద్వారా అక్రమ క్రిప్టో ట్రేడింగ్ సాగించినట్లు కూడా ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.సాంకేతిక విశ్లేషణ, బాధితుల వివరాల ఆధారంగా అసోంలోని బార్పేటకు చేరుకున్న గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసుల టీమ్... మూడు రోజుల పాటు నిందితుడి ఇంటి వద్ద మారు వేషంలో నిఘా ఉంచారు. చివరకు అతడిని డిజిటల్ పరికరాలతో సహా