PSUs Offer for Sale India Target FY27: ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని స్థిరంగా ఉంచడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (OFS), ప్రభుత్వ అసెట్ మానిటైజేషన్ (ఆస్తుల్ని నగదీకరించడం) ద్వారా భారీగా నిధులు ఖజానాకు వచ్చి చేరుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలా రూ. 45,306.05 కోట్లను సమకూర్చడం విశేషం. ఈ మొత్తం అంచనాల్ని మించింది. వాస్తవానికి సవరించిన బడ్జెట్ అంచనాల్లో దీనిని రూ. 33,837 కోట్లుగా అంచనా వేస్తే అంతకంటే ఎక్కువే వచ్చింది. ఈ వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రోజు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణ వంటి ఆదాయం ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 16885.56 కోట్లు వచ్చాయి. గత కొన్నేళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2024-25లో రూ. 10163 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 16507 కోట్లు, 2022-23లో రూ.35294 కోట్లు, 2021-22 లో రూ. 13534 కోట్ల మేర ఆదాయం వచ్చింది.Read Also: పన్ను మినహాయింపుల కోసం అలా చేస్తున్నారా? అస్సలు తప్పించుకోలేరు.. కొత్త సాంకేతికతతో ఐటీ శాఖ నిఘా!ఇక్కడ గత ఆర్థిక సంవత్సరంలో వాటా విక్రయంతో పాటు ఆస్తుల మానిటైజేషన్ ద్వారానే అధిక ఆదాయం వచ్చింది. 2025-26లో అసెట్ మానిటైజేషన్తోనే ఏకంగా రూ. 28,420.49 కోట్లు సమకూరడం విశేషం. ఇక్కడ ప్రభుత్వానికి చెందిన కొన్ని ఆస్తులు, మౌలిక వసతుల్ని ప్రైవేట్ సంస్థలకు నిర్దిష్ట