5x టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు స్క్రీన్లపైనా రెండు 10MP కెమెరాలు ఉన్నాయి. లేటెస్ట్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ జెమిని ఆధారిత ఏఐ ఫీచర్లతో వస్తుంది. Read Also : Flipkart Freedom Sale 2026 : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..! గూగుల్ పిక్సెల్ 11 ప్రో XL స్పెసిఫికేషన్లు : పిక్సెల్ 11 ప్రో XL ఫోన్ 6.8-అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నేరుగా సూర్యకాంతిలో ఈ పిక్సెల్ ఫోన్ 3,600 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. గూగుల్ టెన్సర్ G6 చిప్సెట్తో పాటు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 16GB వరకు ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5,115mAh బ్యాటరీ అందిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం పిక్సెల్ 11 ప్రో XLలో 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 48MP 5x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు.. 120x వరకు ప్రో జూమ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో ఫ్రంట్ సైడ్ 42MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. పిక్సెల్ 11 ప్రో XL క్యాన్యన్, ఆలివ్, ఫాగ్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 11 ప్రో స్పెసిఫికేషన్లు : పిక్సెల్ 11 ప్రోలో టెన్సర్ G6 చిప్, 16GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాదు.. ఈ పిక్సెల్ ఫోన్ 4,850mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, IP68 రేటింగ్ కూడా అందిస్తుంది. పిక్సెల్ 11 ప్రో క్యాన్యన్, ఆలివ్, ఫాగ్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, మాక్రో ఫోకస్‌తో 48MP అల్ట్రావైడ్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 42MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. గూగుల్ ప్రకారం.. ఈ పిక్సెల్ ఫోన్ 24fps, 30fps వద్ద 8K వరకు వీడియోను రికార్డ్ చేయగలదు. పిక్సెల్ 11 స్పెసిఫికేషన్లు : స్టాండర్డ్ పిక్సెల్ 11లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల యాక్చువా ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. అంతేకాదు.. ఈ డిస్ప్లే 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందించదు. ఈ హ్యాండ్సెట్ 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో టెన్సర్ G6 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. పిక్సెల్ 11లో 4,985mAh బ్యాటరీ ఉంది. 30W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. : ఈ ఫోన్లో మాక్రో ఫోకస్‌తో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 10.8MP 5x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 10.5MP ఆటోఫోకస్ యూనిట్. పిక్సెల్ 11 ఫ్రాస్ట్, పిస్తాషియో, హిబిస్కస్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, IP68 రేటింగ్ అందిస్తుంది. Read Also : TRAI New Rules : TRAI కొత్త రూల్స్.. 1601 నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయాలా? ఇదిగో ఫుల్ క్లారిటీ! పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్, 11 ప్రో ఎక్స్ఎల్, 11 ప్రో ధర : భారత మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ రూ. 89,999 ప్రారంభ ధరతో వచ్చింది. పిక్సెల్ 11 ప్రో ధర రూ. 1,19,999, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ప్రారంభ ధర రూ. 1,34,999కు లభిస్తుంది. అయితే, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర రూ. 1,86,999గా ఉంది. గూగుల్ లాంచ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇందులో రూ. 10వేల వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 9వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఉన్నాయి. భారత మార్కెట్లో అధికారిక గూగుల్ స్టోర్‌లో పిక్సెల్ 11 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ పిక్సెల్ ఫోన్లను తగ్గింపు ధరకే ఆర్డర్ పెట్టుకోవచ్చు. పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL ఆగస్టు 20 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ సేల్ తేదీలు ఇంకా రివీల్ కాలేదు.