
వాహనదారులకు గుడ్ న్యూస్ 121 టోల్ ప్లాజాల్లో లోకల్ పాస్ అందుబాటులోకి ఏపీలో 12 టోల్స్, తెలంగాణలో 3 టోల్స్ టోల్ ప్లాజాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఇంట్లో నుంచే ఆన్లైన్లో అప్లయ్ చేయొచ్చు FASTag Local Pass : వాహనదారులకు అదిరిపోయే వార్త.. ఈ అర్హత ఉన్న వాహనదారులు లోకల్ పాస్ తీసుకోవచ్చు. 121 టోల్ ప్లాజాలకు డిజిటల్ లోకల్ పాస్ విస్తరించారు. 20 కి.మీ పరిధిలోని అర్హత ఉన్న స్థానికులు ఆన్లైన్లో నెలవారీ పాస్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. లోకల్ వాహనదారులకు అందించే డిజిటల్ (FASTag Local Pass) సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విస్తరించింది. దాంతో ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇకపై అర్హత ఉన్న వాహనదారులు ఆన్లైన్లోనే నెలవారీ లోకల్ పాస్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గతంలో ఈ పాస్ కోసం టోల్ ప్లాజాకు స్వయంగా వెళ్లి అడ్రస్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లను సమర్పించాల్సి వచ్చేది. కొత్త డిజిటల్ విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది. 20 కిలోమీటర్ల రేంజ్ కీలకం : అర్హత ఉన్న వాహనదారులకు టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఈ లోకల్ పాస్ కోసం అప్లయ్ చేయొచ్చు. పాస్ వచ్చాక నిబంధనల లోబడి ఆ నెలలో టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. ఇందులో భాగంగా DigiLocker, VAHAN వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో ఇండి అడ్రస్, వాహనం, ఫాస్టాగ్ వివరాలను ధృవీకరిస్తారు. జీఐఎస్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ అడ్రస్ టోల్ ప్లాజా నుంచి 20 కి.మీ రేంజ్ ఉందో లేదో కూడా చెక్ చేస్తారు. 121 టోల్ ప్లాజాలకు విస్తరణ: ఫస్ట్ టైమ్ డిజిటల్ లోకల్ పాస్ విధానాన్ని 2026 జూలైలో ఢిల్లీలోని మండ్కా బక్కర్