
ఇది టెంపుల్ జ్యూయలరీ టైపు హారం. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి రూపు ఉంటుంది. వేలాడుతున్నపూసలు ఎంతో అందాన్ని ఇస్తాయి. లైట్ వెయిట్లో 5 తులాల్లో ఇది వస్తుంది. పూర్వం కాసులపేరునే వేసుకునేవారు మహిళలు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ ఫ్యాషన్ వచ్చేసింది. కాకపోతే కాసులపేరుకు జగత పూసలు, రంగు రంగుల రాళ్లు చేరుతున్నాయి. మామిడి పిందెల ఆకారంలో వచ్చే బంగారు హారం ఇది. మధ్యలో అందమైన డిజైన్ తో రాళ్లు పొదిగిన పెండెంట్ కూడా వచ్చింది. చీరలపై ఇలాంటి భారీ హారం ఒక్కటి వేసుకుంటే చాలు ఎంతో నిండుగా కనిపిస్తారు. లక్ష్మీ రూపు ఉన్న కాసులతో సిద్ధం చేసిన హారం ఇది. చూసేందుకు ఎంతో ఎలిగెంట్ గా ఉంటుంది. పెద్ద పెండెంట్ తో వచ్చే హారం ఇది. చీరలపై, లెహెంగాలపై అదిరిపోయే లుక్ ఇస్తుంది. పట్టు చీరపై ఇలాంటి కాసుల పేరు ఒక్కటి వేసుకున్నా చాలు.. మరొక నగ అవసరం లేదు. Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే! Anklet Designs: ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో