
ఆళ్లగడ్డ గ్రామీణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి నిత్య ఆరాధనలు చేశారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి, సుదర్శన మూర్తి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి ఆలయ ముఖద్వారం మండపంలో కొలువుంచారు. అర్చకులు వేదమంత్రాలతో సుదర్శన హోమం జరిపారు. ఈ కైంకర్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు స్వామి, అమ్మవారికి మంగళహారతి అందించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మనీయార్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.