ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుభవార్త చెప్పాడు. మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్ దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని, ఆ చిన్నారికి 'మాయా మ్యాక్స్‌వెల్' అని పేరు పెట్టినట్లు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేస్తూ, "మా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ క్రేజీ జంటకు క్రికెటర్లు, ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.గ్లెన్ మ్యాక్స్‌వెల్-విని రామన్ లవ్ స్టోరీ దాదాపు దశాబ్దం కిందట ప్రారంభమైంది. భారత సంతతికి చెందిన విని రామన్‌ను డిసెంబర్ 2013లో మొదటిసారి కలుసుకున్నాడు మ్యాక్స్‌వెల్. ఆపై కొన్నాళ్ల పాటు వీరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2017లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 2020లో నిశ్చితార్థం చేసుకోగా, మార్చి 2022లో మెల్బోర్న్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విని రామన్ భారత సంతతికి (తమిళ బ్రాహ్మిన్) చెందిన మహిళ కావడంతో, వీరి వివాహం క్రిస్టియన్ పద్ధతితో పాటు తమిళ సంప్రదాయాల ప్రకారం కూడా ఘనంగా జరిగింది.ఈ దంపతులకు తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. సెప్టెంబర్ 11, 2023న జన్మించిన అతడికి 'లోగాన్ మావెరిక్' అని పేరు పెట్టారు. క్రికెట్ మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే మ్యాక్స్‌వెల్.. వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఈ క్షణాలను తన కెరీర్లో ఎంతో స్పెషల్ అని అభివర్ణించాడు. ఇండియన్-ఆస్ట్రేలియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విని రామన్ కూడా ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పాప రాకతో ఈ కుటుంబం మరింత మురిసిపోతోంది.ఇక క్రికెట్ విషయానికి వస్తే, మ్యాక్స్‌వెల్ త్వరలోనే మళ్లీ మైదానంలో సందడి చేయబోతున్నాడు. ఆగస్టు 26