Dividend: మిడ్ క్యాప్ విభాగంలో బలమైన ఆర్థిక ప్రదర్శన కనబరుస్తున్న జిల్లెట్ ఇండియా ( Gillette India Share Price ) తమ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడులు అందిస్తోంది. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై 600 శాతం మేర డివిడెండ్ చెల్లిస్తోంది. అంటే ఒక్కో షేరుకు రూ.60 చొప్పున డివిడెండ్ డబ్బులు అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి వస్తాయి. షేరు ధరతో సంబంధం లేకుండా ఈ డబ్బులు చెల్లిస్తారు. మరి ఈ డివిడెండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.డివిడెండ్ అర్హత, రికార్డ్ తేదీ వివరాలు డివిడెండ్ మొత్తం: ఒక్కో షేరుకు 600 శాతం అంటే రూ.60 చొప్పున చెల్లించనున్నారు. రికార్డ్ తేదీ: ఆగస్టు 24, 2026ను రికార్డ్ తేదీగా నిర్ణయించారు. ఎవరికి అర్హత ఉంటుంది ?: ఆగస్టు 24వ తేదీ లోపు కంపెనీ డీమ్యాట్ ఖాతా రికార్డులలో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్‌ను పొందడానికి అర్హులు. ఎక్స్-డివిడెండ్ తేదీ: సాధారణంగా రికార్డ్ తేదీకి ఒక రోజు ముందు లేదా అదే రోజు (T+1) సెటిల్మెంట్ ప్రకారం ఎక్స్ డివిడెండ్ తేదీగా మారుతుంది. అంటే ఆగస్టు 21వ తేదీన మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది.జిల్లెట్ ఇండియా వ్యాపార బలంప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సమూహానికి చెందిన జిల్లెట్ ఇండియా, దేశీయంగా షేవింగ్ ప్రొడక్ట్స్, రేజర్లు, బ్లేడ్లు, పర్సనల్ కేర్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ వద్ద ఉన్న బలమైన బ్రాండ్ వాల్యూ, మెరుగైన త్రైమాసిక లాభాలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నిర్ణయాలు ఈ స్టాక్‌ను దీర్ఘకాలికంగా బలంగా ఉంచుతున్నాయి.స్టాక్ పనితీరుజిల్లెట్ ఇండియా కంపెనీ స్టాక్ ఈరోజు రూ. 7515 వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఒక దశలో రూ. 7555 గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ వార్త రాసే సమయానికి స్వల్ప లాభంతో రూ. 7529 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 10,740 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ. 7,206 వద్ద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 24,530 కోట్లుగా ఉంది.Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం అందించడానికి ఉద్దేశించినదే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్ అంటేనే హైరిస్క్ ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది.