
విమాన ప్రయాణికులకు విభిన్న రుచులు ఇన్‌ఫ్లైట్ క్యాటరింగ్‌కు భారీ వంటశాల ఈనాడు, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాల్లో అందించే ఆహారం(ఇన్‌ఫ్లైట్ క్యాటరింగ్) తయారీకి ఎన్‌కామ్ స్కై ప్లేట్స్ సంస్థ ఇక్కడే వంటశాల భవనాన్ని ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటులో గ్లోబల్ సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను అనుసరించింది. ఆహార నాణ్యత, స్వచ్ఛత దెబ్బతినకుండా భవనంలో వేర్వేరు వంటశాలలను నిర్మించింది. ప్రయాణ సమయానికి తగినట్లు ప్యాక్ చేసి సరఫరా చేస్తుంది. ఇందుకు అవసరమైన నిపుణులను నియమించుకుంది. ఆహార తయారీలో అధునాతన సాంకేతికతను సంస్థ వినియోగించనుంది. ఏఐ ఆధారిత మెనూ ప్లానింగ్‌కు ప్రయాణికుల ఇష్టాయిష్టాలను అంచనా వేస్తూ పదార్థాలు వృథాకాకుండా ఏఐ సాయంతో మెనూలు డిజైన్ చేస్తుంది. వంటశాలలో ఆహారం తయారైనప్పటి నుంచి విమానంలో ప్రయాణికులకు చేరే వరకు నాణ్యతను ట్రాక్ చేయటానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సర్లను వినియోగిస్తుంది. ఆహార పదార్థాలు పాడవకుండా, బ్యాక్టీరియా చేరకుండా భారీ శీతల గిడ్డంగులు నిర్మించింది. ముడిపదార్థాల నిల్వకు అధిక విస్తీర్ణంలో చిల్లర్ ఏరియా, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఫ్రీజర్ ఏరియాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు