
కొన్ని పనులు చూడటానికి చిన్నవిగానే అనిపించినా... సరిగ్గా చేయకపోతే వాటివల్ల వచ్చే తంటాలు మాటల్లో చెప్పలేం. కొన్ని పనులు చూడటానికి చిన్నవిగానే అనిపించినా... సరిగ్గా చేయకపోతే వాటివల్ల వచ్చే తంటాలు మాటల్లో చెప్పలేం. కూరగాయల్ని కడగడం, వేడి వేడి ఆహార పదార్థాలు ఉన్న పాత్రల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటుకి మార్చడం, కుక్కరు పెట్టాక విజిల్ నుంచి వచ్చే ఆవిరి, నీళ్లు వంటగదంతా చిమ్మకుండా జాగ్రత్త పడటం... వంటివి ఈ కోవకు చెందినవే. వీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా... ఒకటికి రెండు పనులవుతాయి. అలా కాకుండా సహకరిస్తాయీ పరికరాలు. వంట తొందరగా పూర్తవ్వాలన్నా, గ్యాస్ వాడకాన్ని తగ్గించాలన్నా... కుక్కర్‌కి మించిన ఆప్షన్ ఇంకొకటి ఉండదు. అందుకే మన వంటింట్లో దానికి చోటెక్కువ. కానీ అందులో నీళ్లు పోసేటప్పుడే సమస్యంతా. చాలామంది అంచనాగా నీళ్లు పోస్తుంటారు. కొన్నిసార్లు పక్కా కొలతలతో పోసినా లీకేజ్ సమస్యలు ఉంటాయి. విజిల్ వచ్చినప్పుడు వంటగట్టు, క్యాబిన్లంతా ఆ నీళ్లు చిమ్ముతుంటాయి. కింద కూడా పడుతుంటాయి. దాన్ని శుభ్రం చేయడం అదనపు శ్రమగా మారుతుంది. అలా కాకూడదంటే ఈ ‘ప్రెజర్ కుక్కర్ విజిల్ కవర్ క్యాప్’ను వినియోగించి చూడండి. దీన్ని విజిల్‌పై పెడితే సరి. అన్నం గంజి, పప్పు, కూరగాయల నీళ్లు బయటికి చిమ్మకుండా చేస్తుంది. మార్బుల్స్, గాజు, చెక్క... వంటి వాటితో చేస్తోన్న వంటగదులకి ప్రాధాన్యత పెరుగుతోంది. డైనింగ్ టేబుల్ కూడా ఈరకమైన మెటీరియల్ వాడి తయారుచేసినవే ఇష్టపడుతోందీ తరం. అయితే వీటిని ఎలా పడితే అలా వినియోగించలేం. ముఖ్యంగా వేడి వస్తువులు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఏదో ధ్యాసలో ఉండి పెట్టామా కిచెన్ కౌంటర్ పాడవుతుంది. గ్లాస్ టేబుల్ అయితే పగిలిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఆ సమస్య రాకుండా కాపాడతాయీ ‘సిలికాన్ మ్యాట్స్’. టేబుల్ లేదా కౌంటర్ టాప్‌లపై వీటిని పెట్టి వేడి పాత్రలు పెడితే సరి. పుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారుచేయడం