
ఒప్పంద ఉద్యోగులనే కారణంతో సర్వీసు ప్రయోజనాల నిరాకరణ తగదు లఖ్‌నవూ: ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తోన్న స్పెషల్/రిసోర్స్ టీచర్లకు వారికి చెల్లిస్తున్న వేతనాల్లోని వ్యత్యాసాలను తొలగించడంతో పాటు సర్వీసు ప్రయోజనాలనూ కల్పించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా సేవలందిస్తున్న స్పెషల్ టీచర్లకు ఒప్పంద ఉద్యోగులనే కారణంతో గతంలో ఎప్పుడో నిర్ణయించిన తక్కువ వేతనాలనే చెల్లిస్తామనడం సరికాదని జస్టిస్ ఇర్షాద్ ఆలీ అభిప్రాయపడ్డారు. నాలుగు నెలల్లోగా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేశారు. సరిహద్దు పరిస్థితులే ద్వైపాక్షిక బంధానికి ప్రతిబింబం దిల్లీ: భారత చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు అద్దం పడతాయని భారత్ మంగళవారం స్పష్టం చేసింది. వాస్తవాధీనరేఖ వెంబడి శాంతి నెలకొనడం అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 27 ప్రదేశాలను వాటి ప్రామాణిక నామాలతో భారత చిత్రపటంలో గుర్తించడాన్ని చైనా తప్పు పట్టడంలో అర్థం లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ విషయంలో చైనా విమర్శలను భారత్ తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయడానికి వీల్లేని అంతర్భాగమని, ఇది వివాదానికి ఏమాత్రం ఆస్కారం లేని వాస్తవమని తేల్చిచెప్పింది. ‘‘సరిహద్దులో శాంతి సుస్థిరతలు కొనసాగించడం ఎంతో ముఖ్యం. సరిహద్దులోని పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తాయని చైనాకు తెలియజేశాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ పేర్కొన్నారు. గత వారం జరిగిన భారత-చైనా సరిహద్దు వ్యవహారాల సమన్వయ, సంప్రదింపుల సమావేశంలో ఈ విషయాలు స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు. అత్యంత ప్రభావశీల ప్రధానిగా చరిత్రలో మన్మోహన్: సోనియా దిల్లీ: ఎప్పుడూ మౌనంగా, సౌమ్యంగా ఉంటూ వచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను భారత్‌కు లభించిన అత్యత ప్రభావశీల ప్రధానమంత్రిగా చరిత్ర గుర్తుంచుకొంటుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు మన్మోహన్ సింగ్‌కు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం ఓ