
సుప్రియ యార్లగడ్డ, ప్రీతీజింటా, సునీల్‌శెట్టి, ప్రియదర్శన్‌లకు చోటు ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 18 మందితో కొత్త సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సెన్సార్‌ బోర్డు)ను ఏర్పాటుచేసింది. ఈ బోర్డు మూడేళ్లపాటు కొనసాగనుంది. ఇందులో సినీనటుడు నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్‌ నటులు సునీల్‌శెట్టి, ప్రీతీజింటా, పంకజ్‌త్రిపాఠి, మనోజ్‌జోషి, కశ్మీర్‌ఫైల్స్‌ నటీమణి పల్లవి జోషి, నటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు రూపాగంగూలీ, రచయిత, విమర్శకులు వినోద్‌ అనుపమ్, సంగీతదర్శకులు రికీ కేజ్, గాయకులు, మాజీ ఎంపీ హంస్‌రాజ్‌ హంస్, పాత్రికేయుడు యతీంద్రమిశ్ర, రచయిత అభిషేక్‌ జైన్, ఒడిశాకు చెందిన దర్శకుడు, నిర్మాత నీలా మాధబ్‌ పాండా, ప్రముఖ బెంగాల్‌ నటుడు, నిర్మాత ప్రొసేన్‌జీత్‌ ఛటర్జీ, మరాఠీ నటి నిషిగంధా వాద్, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా మాజీ డైరెక్టర్‌ వామన్‌ కేంద్రే, మహారాష్ట్రకు చెందిన రచయిత, సంపాదకుడు, సామాజిక కార్యకర్త రమేశ్‌రఘునాథ్‌ పతంగేలు సభ్యులుగా నియమితులయ్యారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





