
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లోని ఓ ఇంట్లోకి ఏకంగా కారుతోనే వెళ్లొచ్చు. రెండు, మూడు అంతస్తుల వరకు వెళ్లి బెడ్‌రూమ్‌లోనే పార్క్‌ చేయొచ్చు. అంత ప్రత్యేకం గనకే స్థానికులు ఆ బంగళాని ‘అమెరికన్‌ హౌస్‌’, ‘డాలర్‌ విల్లా’ అని పిలుస్తుంటారు. అమెరికాలో స్థిరపడ్డ అజయ్‌సింగ్‌ తనకు నచ్చినట్టుగా నిర్మించుకున్నారు. ప్రధాన ఆకర్షణ.. ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌నే. దాని ద్వారా వాహనాల్ని రూఫ్‌టాప్‌ వరకు తీసుకెళ్లొచ్చు. అంతేనా.. స్విమ్మింగ్‌పూల్, ఫౌంటెన్, విశాలమైన గార్డెన్, హైడ్రాలిక్‌ లిఫ్ట్, సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటి సౌకర్యాలతో విలాసంగా ఉంటుందా భవంతి. మాస్టర్‌ బెడ్‌రూమ్‌ నుంచి మెయిన్‌ గేట్‌ కనిపించేలా డిజైన్‌ చేయడం, లివింగ్‌ రూమ్‌లో నడుస్తున్న సినిమాను బెడ్‌రూమ్‌లోనూ చూసేలా స్క్రీన్‌ ఏర్పాటు చేయడం ఈ ఇంటి మరో ప్రత్యేకత. ప్రస్తుతం రూ.35 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





