
డా.కుల్దిప్‌ త్రిపాఠి వెల్లడి నిర్విన్‌లో సాగు చేసిన బంబార వేరుసెనగ క్షేత్రంలో విదేశీ ప్రతినిధులు, పరిశోధకులు కొత్తకోట గ్రామీణం, న్యూస్‌టుడే: ఆఫ్రికా దేశానికి చెందిన బంబార రకం వేరుసెనగ సాగుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని కిర్క్‌హౌస్‌ ట్రస్టు, ఇంగ్లాండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డా.క్లాడియా కానలెన్‌ హోల్జైస్, దిల్లీ (ఎన్‌బీపీజీఆర్‌) ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు డా.కుల్దిప్‌ త్రిపాఠి పేర్కొన్నారు. కొత్తకోట మండలంలోని నిర్విన్‌లో రైతులు బాలరాజు, ఆనంద్‌కుమార్‌ బంబార రకం వేరుసెనగ సాగు చేపట్టారు. సౌత్‌ ఆఫ్రికా, జాంబియా, జింబాబ్వే, కెన్యా, నమీబియా, అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్, మడగాస్కర్‌ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం, శాస్త్రవేత్తలు శనివారం పంటను పరిశీలించారు. స్థానిక వాతావరణం, పంట ఎదుగుదలను పరిశీలించిన అనంతరం బంబార వేరుసెనగ పంటపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని డా.కుల్దిప్‌ త్రిపాఠి పేర్కొన్నారు. భవిష్యత్తులో సాగును పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి రామకృష్ణ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఏఆర్‌), నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (ఎన్‌బీపీజీఆర్‌) ప్రాంతీయ కేంద్రం అధికారి డా.శరవణన్, మదనాపురం కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి, వివిధ దేశాల ప్రతినిధుల బృందాలు పాల్గొన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





