
సూర్యాపేట జిల్లాలోని నూతనకల్‌ మండలంలో శనివారం రాత్రి జోరు వాన కురిసింది. దీంతో పాలేరు వాగు పొంగిపొర్లి.. వెంకేపల్లి, తాళ్లసింగారం, యడవెల్లిలోని చెక్‌డ్యాంలు వరదనీటితో కళకళలాడాయి. ముఖ్యంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు చుక్క నీరు లేక వెలవెలబోయిన గుండ్లసింగారం చెక్‌డ్యాం మధ్యాహ్నం 2 గంటలకు వరద నీటితో ఇలా పరవళ్లు తొక్కి.. ఆయకట్టు రైతుల్లో సంతోషం నింపింది. వరి పంట చేతికి అందదని దిగాలుపడ్డామని, ఇక భయం లేదని వారు హర్షం వ్యక్తం చేశారు. న్యూస్‌టుడే, నూతనకల్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





