
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వినాయకుడు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కైలాసం థీమ్‌తో ఏర్పాటు చేసిన మండపం ఆకట్టుకుంటోంది. అందులో పార్వతీపరమేశ్వరుల చుట్టూ గణనాథుడు ప్రదక్షిణలు చేస్తున్నాడు. దక్షిణం బజార్‌లో 2,11,116 పెన్నులతో 42 అడుగుల విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విజయనగరంలోని కొత్త అగ్రహారంలో త్రీడీ లేజర్‌ షో ద్వారా విఘ్నేశ్వరుడు వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. రాజాం మండలం బొద్దాంలో 150 కిలోల పసుపు కొమ్ములతో 15 అడుగుల గణపతి, కర్నూలు జిల్లా పత్తికొండలో 11 మంది సభ్యులతో క్రికెట్‌ ఆడుతున్న వినాయక ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూశారా: వైవిధ్య వినాయక- 2: సైకత గజాననుడు, గంధపు గణపతి.. ఇంకా
Tags:#zwnj zwnj
Found this helpful?
Share this story with your network